ఆగస్టులో ‘అత్తారింటికి దారేది’ అంటూ అభిమానులను అలరించడానికి సమంతతో కలిసి వస్తున్న పవర్ స్టార్ పవన్ మళ్లీ తరువాతి సినిమా విడుదల వ్యవహారాన్ని కూడా ఇఫ్పుడే డిసైడ్ చేసేసాడు. సంపత్ నందితో చేయబోయే సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నాడు. మరీ కష్టమైతే మార్చి దాకా మార్చవచ్చని, అది మాత్రం దాటనివ్వవద్దని నిర్మాత దర్శకులకు ఇప్పటికే పవన్ స్పష్టం చేసేసాడట. కథ, స్క్రిప్ట్, సిద్ధంగా వున్న ఈ సినిమాకు హీరోయన్ వ్యవహారం ఒక్కటే బకాయి., ఒక వేళ అది ఇప్పట్లో ఫైనల్ కాకున్నా, ఆగస్టులో హీరో సొలో సీన్లతోనైనా షూటింగ్ ప్రారభించేయాలన్నది పవన్ పట్టుదల. ఆరునెలల గ్యాప్ లో రెండు పవన్ సినిమాలు అంటే అభిమానులకు పండగే మరి.
No comments:
Post a Comment