Wednesday 17 July 2013

Pawan Kalyan stylish look boosts AD

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆగష్టు 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబందించిన కొన్ని స్టిల్స్ బయటకి వచ్చాయి, ఆ స్టిల్స్ కి పబ్లిక్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే ఇటీవల కాలంలో ఇదే పవన్ బెస్ట్ లుక్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫొటోస్ కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ అత్తారింటికి దారేది ప్రొడక్షన్ టీం కి మంచి బూస్ట్ ఇస్తోంది.

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో పవన్ – సమంతలకు బాగా కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్ రాసారని సమాచారం. ఈ నెల 19న ఆడియో రిలీజ్ చేయనున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ తెలుగు వారికి పరిచయం కానున్నాడు.


No comments:

Post a Comment