Monday 8 July 2013

అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్ జరుగుతుందట

పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటిస్తున్న అత్తారింటికి దారేది ఆడియో వేడుక పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. కొదరు ఆడియో ఫంక్షన్ జరుపుతారు అని అంటే మరి కొందరు లేదని అంటున్నారు. ఇది ఇలా ఉంటె మెగా అభిమానులు మాత్రం ఆడియో ఫంక్షన్ జరుగుతుందో లేదో తెలియక అయోమయంలో ఉన్నారు. అయితే అన్ని అనుమానాలను తెరదించుతూ సమంత 'అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్ అతి త్వరలో జరగనుంది' అని తన ట్విట్టర్ ద్వారా అభిమానులకి తెలియజేసింది. దీంతో మెగా అభిమానులు హమ్మయ పవన్ కళ్యాణ్ ని చూసే అవకాశం వచిందని సంతోషపడుతున్నారు. అయితే ఆడియో ఎప్పుడు ఎక్కడ జరగనుందో ఇంకొన్ని రోజుల ఆగితే తెలిసిపోతుంది.



No comments:

Post a Comment